16 July, 2026 | 11:46 PM

రిటైర్మెంట్ కాదు.. విరామం మాత్రమే!

04-12-2024 12:00 AM

విక్రాంత్ మాస్సే.. నటనకు విరామం ప్రకటిస్తున్నారంటూ తాజా గా పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఇది పెను సంచలనానికి దారి తీసింది.  ఎందుకంటే ఈయన అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితు లే. తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’ ధారావాహిక అప్పట్లో సంచల నం. ఇది చూసిన వారందరికీ విక్రాంత్ ఎవరనేది తెలుస్తుంది. ‘ట్వెల్త్ ఫెయిల్’తోనూ దేశం దృష్టిని ఆకర్షించారు. అలాంటి విక్రాంత్ మాస్సే కేవలం 37 ఏళ్ల వయసులో నటనకు స్వస్తి చెబుతున్నారంటూ నానా రచ్చ జరిగింది.

వాస్తవానికి ఆయన రిటైర్‌మెంట్ ప్రకటించలేదు. విరామం మాత్రమే ప్రకటించారు. ఆయన పెట్టిన పోస్టును మిస్ రీడ్ చేయడంతో వచ్చిన తంటా ఇది. పరిస్థితులు చక్కబడే వరకూ తాను నటనకు బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించారు. తన కుటుంబానికి పూర్తి సమయం కేటాయించాలనుకుంటున్నారట. అందుకే నటనకు విరామం ప్రకటించారని సమాచారం.