11 August, 2026 | 1:47 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

స్టార్ హీరోలు కాదు.. నా పాత్రే ముఖ్యం

24-08-2024 12:41 AM

‘నేను అగ్ర హీరోల సినిమాల్లో నటించినా అందులోని నా పాత్ర ప్రాధాన్యతే నాకు ముఖ్యం’ అంటోంది బాలీవుడ్ కథానాయిక శ్రద్ధా కపూర్. ఇటీవల ఈ భామ నటించిన ‘స్త్రీ2’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.400 కోట్ల వసూలు చేసిందనేది తాజా వార్త. ఈ సినిమాలో తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న శ్రద్ధా కపూర్  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

బాలీవుడ్‌లోని ముగ్గురు ఖాన్‌లతో కలిసి పనిచేసే అవకాశాలు వచ్చినా కొన్ని కారణాలతో నటించలేకపోయానని తెలిపింది. ‘చిత్ర పరిశ్రమలో మీకు వరుస అవకాశాలు వస్తూనే ఉంటాయి. కానీ ఆ ప్రాజెక్టులో మీరు పోషించే పాత్రకు ప్రాధాన్యత ఉండి.. అది మిమ్మల్ని సవాలు చేసేలా ఉంటేనే అంగీకరించండి. లేకపోతే అందులో ఎంత పెద్ద స్టార్ నటించినా వదిలేయండి. నేను ఎంచుకునే పాత్రల విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది. మంచి కథలతో ప్రేక్షకులను ఆకర్షించేందుకు అద్భుతమైన దర్శకులతో పనిచేయాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది శ్రద్ధ.