22-06-2025 12:00:00 AM
- మానవ మేథస్సుకు అది ప్రత్యామ్నాయం కాదు
- నైపుణ్యముంటే ఆయా రంగాల్లో ఉద్యోగాలకు భద్రత
- ఏఐ ప్రత్యామ్నాయం కానీ ఉద్యోగాలూ ఉన్నాయి..
- ఆ దిశగా యువత దృష్టి సారించాలని నిపుణుల సూచన
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్న టెక్నాలజీ కింగ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). దాదాపు అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. ఎన్నో అద్భుతాలను సైతం సృష్టిస్తున్నది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఏఐ అసాధారణమైన ప్రభావాన్ని చూపుతున్నది. ఇక భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోనే నడుస్తుందనే పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో ప్రత్యక్షంగా లక్షలాది మందికి, పరోక్షంగా కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఐటీ రంగంలో ఏఐ ప్రభావం ఉద్యోగులకు కాస్త భయాన్ని కలిగిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ భవిష్యత్‌లో మానవ వనరులకు ప్రత్యామ్నాయం గా మారుతుందేమోనని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే మనిషి సృష్టించిన ఏఐ మానవాళికి ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదని టెక్ రంగ నిపుణులు చెబుతున్నారు.
సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్ని అద్భుతాలు సృష్టించిన మనిషి స్థానాన్ని భర్తీ చేయలేదని అభిప్రాయపడుతున్నారు. ఏఐ అత్యాధునిక సాంకేతికత అయినప్పటికీ మనిషి నిర్వర్తించాల్సిన విధు లు కూడా ఉంటాయని, ఏఐతో ముప్పేమీ లేదని స్పష్టం చేస్తున్నారు.
ఐటీ ఉద్యోగాల్లో ఏఐ పాత్ర.. మనుషుల ప్రాధాన్యం...
-డేటా సైంటిస్టులు..
డేటాసైన్స్ అనేది డేటా క్లీనింగ్, ప్రీప్రాసెసింగ్ వంటి అనేక అంశాలను ఏఐ ఆటోమే ట్ చేసే ఒక ఫీల్డ్. అయినా డేటా సైన్స్‌లో ఏఐ ప్రోగ్రామ్ చేయలేని మానవ ఆలోచన అవసరం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనితీరు కేవలం అంకెలు, సంఖ్యల్లో మాత్రమే ఉంటుంది. కానీ డేటా సైంటిస్టులు తమ మేథస్సుతో అర్థవంతమైన ఫలితాలను సాధించగలరు.
-ఏఐ ఎథిసిస్ట్స్..
ఏఐ విస్తృతమవుతున్న నేపథ్యంలో ఏఐ ఎథిక్స్ నిపుణుల అవసరం చాలా కీలకంగా మారింది. ఈ నిపుణులు ఏఐ సిస్టమ్‌ల ఎథి క్స్ అమలుకు మార్గనిర్దేశం చేస్తారు. ఏఐ వ్యవస్థలు పారదర్శకంగా, వినియోగదారుల గోప్యతను రక్షించే విధంగా ఉండేలా చూస్తా రు. ఏఐ వినియోగం కారణంగా వచ్చే సమస్యలను, సామాజిక చిక్కులను అంచనా వేస్తారు. ఈ పని చేసే వారికి సామాజిక నిబంధనలు, నైతికత, మానవ హక్కుల గురించి లోతైన అవగాహన అవసరం.
-డెవలపర్లు, ఇంజినీర్లు..
కోడ్ రాయడం, డీ బగ్గింగ్, టెస్టింగ్ కోసం ఏఐ విలువైన సాధనంగా మారింది. ఏదేమైనా వినూత్న సాఫ్ట్‌వేర్ రూపకల్పన, వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడం, సమస్య పరిష్కారంలో సృజనాత్మక త వంటివి మనుషులకు మాత్రమే సాధ్యమై న ప్రత్యేకమైన లక్షణాలు. సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో నైతిక పరిగణనలు, మనుషుల ప్రమే యం ఇప్పటికీ అవసరమే.
-సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్..
అసాధారణ నెట్‌వర్క్ తీరు లేదా పొటెన్షియల్ థ్రెట్స్‌ను గుర్తించడం ద్వారా ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీకి సహాయపడుతుంది. అయినా సైబర్ సెక్యూరిటీ నిపుణుల పాత్ర కీలకమైనది. వ్యూహరచన చేయడం, ఏఐ గుర్తించిన అంశాలను సమీక్షించడం, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందు తున్న థ్రెట్స్‌ను గుర్తించి సృజనాత్మకంగా స్పందించడం వీరి ముఖ్యమైన విధులు. మనుషుల మనస్తత్వం, సూక్ష్మనైపుణ్యాలు, సైబర్ నేరస్థుల ఉద్దేశాలను అర్థం చేసుకోవ డం వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేని పనులను వీరు చేస్తారు.
-యూఎక్స్ డిజైనర్లు..
యూజర్ ఎక్స్‌పీరియన్స్(యూఎక్స్) డిజైనర్లు సహజమైన యూజర్లను ఆకర్షించేలా ఇంటర్ ఫేస్‌లను రూపొందిస్తారు. యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అం దించడానికి మనుషుల ఆలోచన తీరు, సాంస్కృతిక అంశాల ను అర్థం చేసుకోవాలి. టెస్టింట్ డేటా అనాలిసిస్ వంటి కొన్ని అంశాల్లో ఏఐ సహాయం చేయగలిగినప్పటికీ సంతృప్తికరమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ రూపొందిం చడంలో డిజైన్ థింకింగ్, సృజనాత్మకత వంటివి యూఎక్స్ డిజైనర్లు మాత్రమే చేయగలుగుతారు.
-డెవాప్స్ ఇంజినీర్లు..
డెవలప్‌మెంట్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం, డెవలప్‌మెంట్ ఆపరేషన్స్ టీమ్స్ మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ప్రధానంగా డెవాప్స్ ఇంజినీర్లు చేసే పని. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లోని భాగాలను ఏఐ ఆటోమేట్ చేయగలదు. కానీ కమ్యూనికేషన్, సహకారం, నిర్ణయం తీసుకోవడానికి మనుషుల అవసరం కీలకం.
-టెక్ ప్రాజెక్ట్ మేనేజర్లు..
ప్రాజెక్ట్ ట్రాకింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్‌లో ఏఐ సహాయపడుతున్నప్పటికీ ప్రాజెక్ట్ మేనేజర్ల పాత్ర కీలకం. టీమ్ కో ఆర్గనైజేషన్, సమస్యలను పరిష్కరించడం, తమ అనుభ వం, సూక్ష్మ దృష్టితో టెక్ ప్రాజెక్ట్ మేనేజర్లు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటి పనులను ఏఐ చేయలేదు.
-ఏఐ/ఎంఎల్ రీసెర్చర్స్..
ఏఐ, మెషిన్ లెర్నింగ్ రీసెర్చర్లు ఏఐ డెవలప్‌మెంట్‌లో ముందంజలో ఉంటారు. మోడల్ ఆప్టిమైజేషన్‌లో ఏఐ సహాయపడగలిగినప్పటికీ ఏఐ, ఎంఎల్ పురోగతిని నడిపించే ప్రాథమిక పరిశోధనకు మనుషుల ఆలోచన, క్రిటికల్ థింకింగ్ అవసరం. మానవ రీసెర్చర్‌లా ప్రశ్నించడం, ఊహించడం, ఆవిష్కరణలు వంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేదు.
-డేటా స్టోరీ టెల్లర్స్..
డేటా స్టోరీటెల్లర్స్ సంక్లిష్ట డేటాను ఆకర్షణీయమైన కథనంలోకి మార్చే నిపుణులు. డేటాను అర్థమయ్యేలా ప్రదర్శించడానికి వీక్షకుల గురించిన లోతైన అవగాహన, సృజనాత్మకత ఎంతో అవసరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటాను హ్యాండిల్ చేయగలదు. కానీ మనుషులను అర్థం చేసుకుని వారికి అర్థమయ్యేలా చెప్పలేదు.
మానవ ప్రమేయమూ అవసరమే..
వాస్తవానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజె న్స్ ప్రస్తుతతరానికి లభించిన అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానమే. ఏ రంగం లోనైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ద్వారా పనిభారం తగ్గుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ పని జరుగుతుంది. ఎంతటి క్లిష్టమైన పని అయి నా ఏఐ వినియోగంతో సులభతరమవుతుంది. కానీ ఏఐ నిర్వర్తించే పనులపై మనుషుల పర్యవేక్షణ తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. మానవ ప్రమేయం లేని ఏఐ టెక్నాలజీతో ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు.
ప్రతీ రం గంలోని ఉద్యోగాల్లో ప్రత్యామ్నాయం లేని కొన్ని విధులు ఉంటాయి. వాటిని కచ్చితంగా మనుషులే నిర్వర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఐటీ రంగానికి సంబంధించి డేటా సైంటిస్టులు, ఏఐ ఎథిసిస్ట్స్, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ఇంజినీర్లు, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, యూఎక్స్ డిజైనర్లు, డెవాప్స్ ఇంజినీర్లు, టెక్ ప్రాజెక్ట్ మేనేజర్లు, ఏఐ/ఎంఎల్ రీసెర్చర్స్, డేటా స్టోరీటెల్లర్స్ వంటి ఉద్యోగాల్లో ఏఐ అవసరం ఉన్నప్పటికీ మనుషుల పాత్ర కూడా తప్పనిసరి అవుతున్నది.
ముఖ్యంగా ఈ ఉద్యోగా ల్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతపై నైపుణ్యాన్ని పెం పొందించుకుంటే ఉద్యోగాలకు వచ్చిన ప్రమాదమేమీ ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఏఐ ప్రత్నామ్నాయం కానీ ఉద్యోగాలపై యువత ప్రధానంగా దృష్టి సారించాలని సూచిస్తున్నారు.