4 July, 2026 | 11:18 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

యోగ ద్వారానే మనిషికి సంపూర్ణ ఆరోగ్యం

21-06-2025 11:49 PM

బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బచ్చనగోని దేవేందర్..

సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): ప్రతిరోజూ యోగ సాధన చేయడం ద్వారా మానవుడు సంపూర్ణ ఆరోగ్యం పొందగలడని బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బచ్చరబోని దేవేందర్(BJP District Vice President Bachchanagoni Devender) అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సంస్థాన్ నారాయణపురం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సుర్విరాజు గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రాచీన శివాలయ ప్రాంగణంలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షుడు బచనగొని దేవేందర్ యాదవ్ మాట్లాడుతూ... యోగ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, ఒత్తిడి ఆందోళనను తగ్గిస్తుందని అన్నారు.

ఏకాగ్రత మానసిక స్పష్టతను మెరుగుపర్చడంతో పాటు ఆధ్యాత్మిక వృద్ధికి దారితీస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగ సాధన చేసి సంపూర్ణ ఆరోగ్యం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపికిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర నరసింహ గౌడ్, జిల్లా నాయకులు వంగరి రఘు, సంగిశెట్టి లక్ష్మీనారాయణ, జక్కర్తి బిక్షం,చిలువేరు వెంకటేష్, సంపతి సుధాకర్ రెడ్డి, ఎలిజాల శ్రీను, కట్కూరి వెంకటేష్, గొల్లూరు యాదగిరి, కోడూరీ బీరప్ప, సురపల్లి జవహర్, జక్కర్ది నరసింహ, ఉస్కాగుల గిరి, నెల్లికంటి శ్రీశైలం, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.