12 June, 2026 | 8:06 PM

డ్రైనేజీపై షాపులు నిర్మించిన యజమానులకు నోటీసులు

12-06-2026 07:01 PM

దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట గ్రామ పంచాయతీ పరిధిలోని శిథిలావస్థకు చేరిన ఇండ్ల యజమానులు, ఖాళీ స్థలాల యజమానులు జూన్ 14వ తేదీలోపు వాటిని శుభ్రం చేయించాలని తెలిపారు. అదేవిధంగా కొంత మంది షాపుల యజమానులు డ్రైనేజీపై శాశ్వత నిర్మాణాలు చేసి రోడ్డుపైనే వ్యాపారాలు నిర్వహిస్తున్నారని వారు కూడా జూన్ 14వ తేదీలోపు ఖాళీ చేసి ప్రత్యామ్నాయం చూసుకోవాలని, లేనియెడల పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం చర్యలు చేపడతామని కార్యదర్శి బండి అనంత్ కుమార్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. దీంతో నోటీసులు అందుకున్న షాపుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.