14 April, 2026 | 1:32 AM

ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన మహానేత శ్రీపాదరావు

14-04-2026 12:00 AM
  1. ఆయన బాటలో మనమందరం పయనిద్దాం 
  2. మంత్రులు శ్రీధర్‌బాబు, లక్ష్మణ్

మంథని, ఏప్రిల్ 13(విజయ క్రాంతి): ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన మహానేత శ్రీపాదరావు అని, ఆయన బాటలో మనమందరం పయనిద్దామని రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌లు పేర్కొన్నారు. సోమ వారం మంథని, ముత్తారం మండలాల్లో నిర్వహించిన శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ఆయ న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంథని శ్రీపాద కాలనీ లో ఏర్పాటుచేసిన శ్రీపాదరావు కాంస్య విగ్రహాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు శ్రీపాదరావు చేసిన సేవలను కొనియాడారు.శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో హుందాతనానికి, విలువలకి మారుపేరుగా నిలిచారన్నారు. శ్రీపాదరావు తనయులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీనుబాబులు తండ్రి ఆశయ సాధనలో భాగంగా ఈ మంథని ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి అత్యధిక నిధులు తీసుకురావడంలో మంత్రిగా శ్రీధర్‌బాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారన్నారు.

కార్యక్రమంలో కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న, కౌన్సిలర్లు పెంటరి రాజు, కర్రు లింగయ్య, ఎల్లంకి వంశీ, మారుపాక నిహారిక, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తోట్ల తిరుపతి యాదవ్, సెగ్గం రాజే ష్, అజీమ్ ఖాన్, శశిభూషణ్ కాచే, పేరవేణి లింగయ్య యాదవ్, మూల సరోజన పురుషోత్తం రెడ్డి, కొండా శంకర్, డిగంబర్, తదితరులు పాల్గొన్నారు.

తండ్రి ఆశయ సాధనకు నిరంతర కృషి

నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు పార్టీలకతీతంగా వైద్య సేవలు అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.  ముత్తారం మండల కేంద్రంలో శ్రీపాదరావు 27వ వర్థంతి సందర్భంగా పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్‌సింగ్ పేదలకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ తన తండ్రి శ్రీపాదరావు ఆశయ సాధన కోసం నిరంతరం పాటుపడుతున్నామన్నారు.

ఈ కంటి వైద్య పరీక్షలు ఇప్పటికే కాటారం డివిజన్‌లో 1000 మందికి పైగా ఆపరేషన్ చేయించి, ఉచితంగా అద్దాలు పంపిణీ చేశామని,అలాగే ముత్తారం మండలంలో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్ చేసి అద్దాలు ఉచితంగా అందిస్తామన్నారు.అలాగే త్వరలోనే మహిళలకు కూడా ఉచితంగా వైద్య పరీక్షలు ఏర్పాటు చేస్తామని, ముత్తారం ప్రాంత ప్రజలకు సాగునీరు అందించామని, అన్ని గ్రామాలను కలుపుతూ డబుల్ రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు.

కాగా ముత్తారం మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్మోహన్ రావును స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.మండల కేంద్రంలో నిరుపేదలకు తన పట్టా భూమిని ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టించేందుకు సహకరించారని, అలాగే ఇప్పటికే మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కూడా వారి సొంత భూమి విరాళంగా ఇచ్చారని మంత్రి అభినందిస్తూ కొనియాడారు. 

కార్యక్రమంలో ముత్తారం మాజీ జెడ్పీటీసీ చొప్పరి సదానందం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్,మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం,మాజీ ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్, పుష్పగిరి వైద్యాసుపత్రి సిబ్బంది, మహేందర్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు