25-11-2025 12:40:59 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మినహా మిగతా మంత్రులు హాజరయ్యారు. మంత్రి పొంగులేటి విదేశీ పర్యటనలో ఉన్నందున్న ఈ మంత్రివర్గ సమావేశానికి హాజరుకాలేకపోయారు. ఈ సమావేశంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ, విద్యుత్ శాఖకు సంబంధించిన అంశాలే ప్రధాన అజెండాగా మంత్రివర్గం భేటీలో చర్చించనున్నారు. అలాగే రామగుండంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు, తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఆవిష్కరణ, డిసెంబర్ 8,9వ తేదీలో జరిగే గ్లోబల్ సమ్మిట్ పై ప్రత్యేకంగా చర్చించనున్నారు.