15 June, 2026 | 11:43 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

సంగారెడ్డి జిల్లాలో మొత్తం 101 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల

27-09-2025 11:04 PM

సంగారెడ్డి,(విజయక్రాంతి): ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్, ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 2025–27 సంవత్సరం మద్యం పాలసీకి సంబంధించి సంగారెడ్డి జిల్లాలో మొత్తం 101 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి యస్.నవీన్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి స్టేషన్ పరిధిలో 24, పటాన్చెరు 35, జహీరాబాద్ 16, నారాయణఖేడ్ 13, అందోల్  13, మొత్తం 101 మద్యం దుకాణాలలో రెండు ఎస్టీ, 13 ఎస్సీ, 9 గౌడ కులస్తులకు రిజర్వేషన్ కల్పించబడిందని ఆయన వివరించారు.

ఈ కేటాయింపులను జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా తీయడం ద్వారా కేటాయించడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్-26 నుంచి అక్టోబర్-18 వరకు జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు సంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కార్యాలయం లేదా నాంపల్లిలోని కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో పని దినములలో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ఈ దరఖాస్తులకు అక్టోబర్ 23న ఉదయం 11 గంటలకు పోతిరెడ్డిపల్లి లోని జేఎన్ఆర్ గార్డెన్ అండ్ ఫంక్షన్ హాల్ లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా కార్యక్రమం నిర్వహించబడనుంది.

మద్యం దుకాణాలకు దరఖాస్తు చేయదలచిన  దరఖాస్తుదారులు రూ.3 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్ ను DISTRICT PROHIBITION & EXCISE OFFICER, SANGAREDDY   పేరుమీద సమర్పించాల్సి ఉంటుంది. మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్, పాన్ కార్డు ప్రతులు తప్పనిసరిగా జతచేయాలి. రిజర్వేషన్ కేటగిరీకి దరఖాస్తు చేసే వారు ప్రభుత్వంచే జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం, స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్. నవీన్ చంద్ర తెలిపారు. మరిన్ని వివరాలకు జిల్లా అధికారి 8712658904, జిల్లా సహాయ అధికారి 8712658907,  సంగారెడ్డి  సీఐ 8712658912,  పటన్చెరు, సీఐ 8712658913, జహీరాబాద్ సీఐ 8712658914,  నారాయణఖేడ్ సీఐ 8712658915, అందోల్ సీఐ 8712658916, ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.