27-09-2025 11:08:26 PM
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి ఉషు పోటీలలో భగవతి విద్యార్ధి ప్రతిభ కనబరిచారు. మహబూబ్ నగర్ లో జరిగిన ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి ఉషు పోటీలలో స్థానిక భగవతి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కే. స్నితిక అద్భుత ప్రతిభ కనబరచి మొదటి బహుమతిని మరియు బంగారు పథకాన్ని సాధించింది.
ఈ సందర్భంగా పాఠశాలల ఛైర్మన్ బి. రమణ రావు విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ... స్నితిక రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచి అండర్ 17 విభాగంలో మొదటి బహుమతిని మరియు బంగారు పథకాన్ని గెలుచుకుందని తెలిపారు. పట్టుదల ఉన్నట్లయితే ఏదైనా సాధించవచ్చని, నేడు విద్యార్థులను కేవలం చదువులోనే కాకుండా ఆటల పోటీలలో కూడా ప్రోత్సహించాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రత్యేకంగా బంగారు పతకంతో సత్కరించారు.