calender_icon.png 28 September, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

27-09-2025 10:57:29 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ పండుగను టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కరీంనగర్ బ్రాంచి ఉద్యోగులు, సలహాదారులు ఘనంగా నిర్వహించారు. బ్రాంచ్ మేనేజర్స్ కె.వీరస్వామి, కె.ఆదర్శ్ కుమార్ మాట్లాడుతూ... బతుకమ్మ పండుగ ఆచారాన్ని గౌరవిస్తూ, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని నిర్వహించామని, ఇంత పెద్ద పండుగను మా ఉద్యోగులు ఏజెంట్లతో జరుపుకోవడం ఆనందంగా ఉందని, ప్రజలందరూ లైఫ్ ఇన్సూరెన్స్ పై అవగాహనా పెంచుకొని, ఆర్థిక భద్రత ను కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.