గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: గణేష్ పండగ అంటే అందరికీ ఇష్టమే. వయసుతో సంబధం లేకుండా గణేష్ పండగను అందరూ ఆనందంతో జరుపుకుంటారు. ఇక పోరగాళ్ల విషయానికోస్తే గల్లీ గల్లీలో గణేష్ విగ్రహాలు పెట్టి పండగ చేసుకుంటారు. కాగా, హైదరాబాద్ నగరంలో గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన, నిమజ్జన ఊరేగింపులకు సంబంధించిన విధివిధానాల నిబంధనలను వివరిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ వివరణాత్మక నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. సెప్టెంబర్ 6 తేదీలోపు విగ్రహ మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం నుంచి గణేష్ మండపాల నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతోందని పోలీసులు వెల్లడించారు. గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 7న ప్రారంభమై సెప్టెంబర్ 17, 2024న నిమజ్జనంతో ముగుస్తాయి. పబ్లిక్ ఆర్డర్, భద్రత పండుగను సజావుగా నిర్వహించేందుకు పోలీసులు అనేక మార్గదర్శకాలను ఏర్పాటు చేశారు.






