15 May, 2026 | 7:47 AM

సచివాలయంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ

26-08-2024 04:56 PM

హైదరాబాద్: సచివాలయంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులు అందజేశారు. సివిల్స్ మెయిన్స్ కు అర్హత సాధించిన 135 మంది అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున సింగరేణి ఆర్థిక సాయం చేస్తోంది. అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ రఘురాం రెడ్డి, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సింగరేణి సీఎండీ బలరాం, ఇతర అధికారులు పాల్గొన్నారు.