25 February, 2026 | 8:29 AM

తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

25-02-2026 01:26 AM

నాగిరెడ్డిపేట్,ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి):తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో 202627 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది.ఈ పాఠశాలల్లో సీటు సాధించిన విద్యార్థులకు పదో తరగతి వరకు ఉచిత విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించబడుతున్నాయి.బాలికలకు హాస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చేరదలిచిన విద్యార్థులు ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇందుకోసం అధికారిక వ్బుసైట్లో అప్లై చేయాలి.గవర్నమెంట్ నోటిఫై చేసిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకే అర్హత ఉంటుంది.అప్లికేషన్ ఫీజు ఓసీ విద్యార్థులకు రూ.200 కాగా,బీసీ,ఎస్సీ, ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పి.హెచ్.సి వర్గాలకు రూ.125గా నిర్ణయించారు.హాల్టికెట్లు ఏప్రిల్ 9 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఏప్రిల్ 19న ఎంట్రన్స్ పరీక్ష జరుగుతుంది.

ఉదయం 10 నుంచి 12 వరకు 6వ తరగతి అభ్యర్థులకు,మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు 710 తరగతుల అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు.6వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఎలక్ట్రానిక్స్,ఐటీ,అగ్రికల్చర్, బ్యూటీషియన్ వంటి వృత్తి విద్య కోర్సులు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.తల్లిదండ్రులు త్వరగా దరఖాస్తు చేస్తే తమ పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య లభించే అవకాశం ఉందని నాగిరెడ్డిపేట్ మండల గోపాల్పేట్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాంప్రసాద్ తెలిపారు.