calender_icon.png 10 July, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల

27-06-2025 12:00:00 AM

92.63 శాతం మంది ఉత్తీర్ణత

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): టీజీ పీజీసెట్ ఫలితాలు వెలువడ్డాయి. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్ లో గురువారం ఉన్నత విద్యామండలి చైర్మ న్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్, వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కిషన్‌కుమా ర్‌రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ అరుణ కుమారి, ప్రొఫెసర్ విజయ్‌కుమార్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

మొత్తం 25,335 మంది దరఖాస్తు చేసుకోగా, 22,983 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 21,290 (92.63 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. దాదాపు 19 పేపర్లకు పరీక్షను నిర్వహించారు.

ఆర్కిటెక్చర్ ప్లానింగ్‌లో మొదటి ర్యాంకును తురియా దీక్షిత్, ఏరోస్పే స్ ఇంజినీరింగ్‌లో తొలి ర్యాంకును చేతరాజు శివ చరణ్, బయోటెక్నాలజీలో తనుజ ఇప్పిలి, మెకానికల్ ఇంజి నీరింగ్‌లో వడ్ల సతీష్, మెటలార్జికల్ ఇంజినీరింగ్‌లో మోత్కూరి మధు శ్రీ హర్షిణి, సివిల్ ఇంజినీరింగ్‌లో వెంకటేశ్, కెమికల్ ఇంజినీరింగ్‌లో అశుతోష్, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో షభిస్తా, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో నర్సింగోజు మహేశ్ తొలి ర్యాంకు సాధించారు.

ఇక ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీ రింగ్‌లో శివ ప్రసాద్, ఫార్మసీలో ఫస్ట్ ర్యాంకు ను షేక్ అర్షియా కౌనైన్, టెక్స్‌టైల్ టెక్నాలజీలో వర్షతోపాటు మరికొంత మంది ఇతర బ్రాంచీల్లో ఫస్ట్ ర్యాంకు సాధించారు. 2023 లో 93.34 శాతం, 2024లో 91.28 శాతం మంది ఉతీర్ణత సాధించగా ఈ  ఏడాది 92.63 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు వెల్లడించారు.