25 March, 2026 | 2:08 AM

రాష్ట్రంలో ఇక ఒకే రెడ్డి సంఘం

25-03-2026 12:35 AM

కమిటీ కో కన్వీనర్‌గా కరుణాకర్‌రెడ్డి 

హైదరాబాద్/ఎల్బీనగర్, మార్చి 24 (విజయక్రాంతి): హైదరాబాద్ నాగోల్‌లో రాష్ట్ర రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో నూతన హడ్‌హక్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రెడ్ల భవిష్యత్తు భద్రత ఆర్థిక రాజకీయ అసమానతలు ఎదురవుతున్న ఇబ్బం దుల దృష్ట్యా అన్ని సంఘాలు కలిసి ఏకవాక్య తీర్మానంతో ఒకే రెడ్డి సంఘం ఉండా లనే నినాదంతో  సాహోసపేతమైన నిర్ణ యం తీసుకున్నారు. రాష్ట్ర కోకన్వీనర్‌గా నల్లవెల్లి కరుణాకర్‌రెడ్డిని నియమించారు.

రా ష్ట్రంలో ఉన్న పేద రెడ్లకు, పేదరెడ్డి విద్యార్థులకు తామున్నామని ఈ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు కోసం వారికి భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలకవర్గంతో పాటు బడ్జెట్ కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి నల్ల వెల్లి కరుణాకర్‌రెడ్డి  విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రెడ్ల కోసం పది ఎకరాల స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి నిధులు కేటా యించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.

తన నియామకానికి సహకరించిన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షు డు ఏనుగు సంతోష్‌రెడ్డి, రాష్ట్ర హడ్‌హక్ కమిటీ చైర్మన్ బద్దూరి వెంకటేశ్వర్‌రెడ్డికి, రెడ్డి నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర అడ్ హాక్ కమిటీ చైర్మన్‌గా బద్దూరి వెంకటేశ్వరరెడ్డి, కన్వీనర్‌గా బుట్టెంగారి మాధవరెడ్డి, కో కన్వీనర్లుగా నల్లవెల్లి కరుణాకర్‌రెడ్డి, కొట్టం మధుసూదన్‌రెడ్డి, వసంత రెడ్డి నూకల పద్మ రెడ్డి, గంగుల శ్రీలతరెడ్డి, నందికొండ గీతరెడ్డి, సభ్యులుగా ఎన్నేపల్లి లింగారెడ్డి, ఎలిమినేటి సుమన్‌రెడ్డి, సలహా దారులగా ఏనుగు సంతోష్‌రెడ్డి, పిట్టా శ్రీనివాస్‌రెడ్డి, గోపు జైపాల్‌రెడ్డి, నల్ల సంజీవ రెడ్డి, నావల్గా సత్యనారాయణరెడ్డి,  బొక్క భూపాల్ రెడ్డి, బొబ్బిలి దామోదర్ రెడ్డి నియమితులయ్యారు.