25 March, 2026 | 2:09 AM

కేటాయింపులు బారెడు.. ఖర్చులు మూరెడు

25-03-2026 12:35 AM

ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

హైదరాబాద్, మా ర్చి 24 (విజయక్రాంతి): బడ్జెట్ కేటాయింపుల కు.. మీరు చేస్తున్న ఖ ర్చులకు పొంతనలేదని, ఇలాగైతే రైజింగ్ తెలంగాణ విజన్ 2047 ఎలా సాధ్యమవుతుందని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు. సంక్షేమం విషయంలో బీఆర్‌ఎస్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తున్నదన్నారు. శాసనమండలిలో బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ..

రెం డేళ్లు గడిచినా ప్రభుత్వానికి పాలనపై పట్టు వచ్చినట్లు కనిపించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం కేంద్రంతో విభేదాలు పెంచుకుని రావాల్సిన నిధులను పొందలేకపోయిందని, ఈ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్రంతో సఖ్యతతో మెలిగి ఐటీ, ఇండస్ట్రియల్ అన్ని సెక్టార్ల అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రభుత్వానికి మల్క కొమురయ్య విజ్ఞప్తి చేశారు.