15 June, 2026 | 9:37 PM

Breaking News

నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •  

ఆర్థిక సంక్షోభం దిశగా రాష్ట్రం

25-03-2026 12:34 AM

మండలిలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): రాష్ట్రం ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తోందని టీచర్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి ఆరోపించారు. శాసనమండలిలో బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి రాష్ట్రం అప్పులు చేస్తోందని, రూ.8 లక్షల కోట్లకు అప్పు చేరిందన్నారు.

భూముల అమ్మకంపై ఆధారపడకుండా ఆదాయాన్ని పెంచుకునేలా ప్రణాళికలుండాలని, ఆర్థిక క్రమశిక్షణ అవసరమన్నారు. గత బడ్జెట్‌కు ఈ బడ్జెట్ మధ్య తేడా లేదన్నారు. రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల పేరుతో పాఠశాలలు మూసివేసే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు. పీఆర్సీ నివేదిక సిద్ధంగా ఉందని, దాన్ని తెప్పించుకుని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు.