ఇక పరిషత్ పోరు.. జడ్పీలే లక్ష్యంగా..
కరీంనగర్ , ఏప్రిల్21 (విజయక్రాంతి): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్దంకావడంతో రాజకీయ పార్టీల్లో ప రిషత్ సందడి మొదలైంది. వాస్తవానికి 2025 సెప్టెంబర్ ఎన్నికలు జరుగు తాయని భావించినా రిజర్వేషన్లు కోర్టు కేసుల కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతో ఆశావహులు కొందరు సరిపెట్టుకోగా.. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులపై కన్నేసిన మరికొందరు వేచిచూసే ధోరణి లో ఉన్నారు. తాజాగా ఓటర్ల ముసాయిదా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశా వాహుల్లో సందడి మొదలైంది.
ఉమ్మడి కరీంనగర్ లోని కరీంనగర్ జిల్లాలో 179 ఎంపీటీసీలు, 15 జెడ్పీటీ సీలు, జగిత్యాల జిల్లాలో 216 ఎంపిటిసి లు 20 జెడ్పిటిసిలు, పెద్దపల్లి జిల్లాలో 138 ఎంపీటీసీలు 13 జడ్పీటీసీలు, రాజ న్న సిరిసిల్ల జిల్లాలో 123 ఎంపీటీసీలు 12 జెడ్పిటిసి స్థానాలు ఉండగా.. గతం లో రిజర్వేషన్ల ప్రక్రియలో అధికంగా బీసీలకు కేటాయించడంతో జనరల్ స్థానాలు తగ్గాయి. అయితే రిజర్వేష న్ల మార్పుల్లో బీసీ రిజర్వుడ్ సీట్లు తగ్గించి 50శాతంలోపు రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉండేలా నిర్ణయం తీసుకోనుడటంతో రిజర్వేషన్ లలో మార్పులు జరిగే అవకాశం ఉంది . ఇది ఇలా ఉంటేఈ సారి జెడ్ పి ల పై జెండా ఎగరేయలని అధికార కాంగ్రెస్, బి ఆర్ ఎస్, బి జె పి పార్టీ లు చూస్తున్నాయి.
రేపు ముసాయిదా జాబితా
.ఎన్నికల ప్రక్రియ ప్రారం భించే క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసిం ది. వచ్చే నెలలోనే పరిషత్ ఎన్నికలు నిర్వహించేం దుకు వీలుగా అధికార యంత్రాంగాన్ని సన్న ద్ధం చేస్తున్నా రు. ఇప్పటికే గ్రామ పంచా యతీ. మున్సిపాలిటీల ఎన్నికల ను విజయవంతంగా నిర్వ హించిన ప్రభుత్వం పరిషత్ ఎన్నికల కు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రక్రియ పూర్త యితే వచ్చే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.2025, జూలై 10 నుంచి ఈ ఏడాది ఫిబ్ర వరి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించిన జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని కలెక్టర్ లకు జారీ చేసిన ల్లో ఆదేశాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం పే ర్కొంది.
ఆ జాబితాలో నియోజక వర్గా ల్లోని అద నపు ఓటర్ల వివరాలను మండ లాల వారీగా గుర్తిం చి, వాటిని సంబంధి త పంచాయతీ, పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జతచేయాలని ఆదేశించింది. వీటి ఆధారంగానే ఎంపీటీ పీ జెడ్పీటీ పీల పరిధిలోని జాబితాలను జిల్లా పంచాయతీ అధికారి ధ్రువీకరించిన అనంతరం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం పోలింగ్ సెంటర్లకు అనుసంధానించాలని పేర్కొం ది. ది. ఈ మేరకు ఈ నెల 23వ లోపు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేసిప్రచురించేందుకు వీలుగా జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. 23 తర్వాత అభ్యంతరాలు, సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని తుది జాబితాను విడుదల చేసి, ఆ తర్వాత పోలింగ్ సెంటర్లు, బ్యాలెట్ బాక్స్ లు, ఇతర ఏర్పాట్లు ప్రారంభిస్తారు.






