8 July, 2026 | 5:06 PM

Breaking News

ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీఓ దొంతు రమేష్   •   ఎస్‌ఐఆర్ నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో మురళి   •   పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •   సీపీఎస్ రద్దుకై త్వరలో ఆమరణ దీక్ష   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మునిగేలా రాజు   •   నాచారంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకులు   •  

జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వ ఎన్ఆర్ఈజిఎస్ డైరెక్టర్ శివశంకర్

16-06-2025 11:16 PM

కొండపాక: ఉపాధి హామీ పనుల పరిశీలనలో భాగంగా సోమవారం కేంద్ర ప్రభుత్వ ఎంఎన్ఆర్ఈజిఎస్ బృందం(Central Government MGNREGS Team) కుకునూరు పల్లి మండలంలోని ముద్దాపూర్, కుకునూరుపల్లి, కొండపాక గ్రామంలో లలో పర్యటించి ముద్దాపూర్ లో  ఫిష్ పాండ్, కుకునూర్ పల్లి లో భూమి చదును పనులు, కొండపాకలో భూమి చదును, మొరం రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం మినర్వా హోటల్ లో జిల్లా కలెక్టర్ కే. హైమావతి తో జిల్లాలో పర్యటించిన సందర్భంగా పరిశీలించిన వివిధ పనుల ప్రగతిపై చర్చించారు. ఈరోజు పరిశీలించిన పనులు సంతృప్తికరంగా ఉన్నాయని పనులన్నీ కూడా ప్రయోజనకరంగా ఉంటాయని ఎన్ఆర్ఈజీఎస్ డైరెక్టర్  ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చేర్యాల  పెయింటింగ్స్ ను జిల్లా కలెక్టర్ ఎన్ఆర్ఈజీఎస్ డైరెక్టర్ కు అందజేశారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమ అగర్వాల్ డిఆర్డిఓ  జయదేవ్ ఆర్య తదితరులు ఉన్నారు.