8 July, 2026 | 5:41 PM

ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీఓ దొంతు రమేష్

08-07-2026 05:06 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు (SIR) కార్యక్రమాన్ని బుధవారం ఎంపీడీఓ దొంతు రమేష్ పరిశీలించారు. ఎస్సీ కాలనీలోని కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను సందర్శించి, ఎన్యుమరేషన్ ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓటర్లకు అవసరమైన సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించడంతో పాటు, వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రవి, జీపీఓ అర్జున్, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.