25 June, 2026 | 2:22 PM

Breaking News

అమెరికాలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి స్వాగతం పలికిన ఎన్నారైలు

29-05-2025 09:26 AM

హుజురాబాద్,(విజయక్రాంతి): అమెరికాలో బిఆర్ఎస్ పార్టీ రజోత్సవాలు జూన్ రెండో తేదీన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) అమెరికాలోని డల్లాస్ చేరుకున్నారు. అక్కడ బిఆర్ఎస్ ఎన్నారైలు ఆయనకు ఘన స్వాగతం  పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై బిఆర్ఎస్ శ్రేణుల ఆదరణ అభినందనీయమని, బిఆర్ఎస్ రజదోత్సవ వేడుకలు అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించుకోవడం ఎంతో చారిత్రకమైనదని తెలిపారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కి  అమెరికాలో కూడా ఆదరణ ఉండడం వెలకట్టలేనిదని తెలిపారు.