15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

'పోలీస్ ప్రజా భరోసా'తోనే సమగ్ర సహాయం

29-05-2025 12:19 PM

సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్

పెన్ పహాడ్: పోలీస్ ప్రజా భరోసాతోనే బాధితులకు సమగ్ర సహాయం అందుతుందని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్(Suryapet DSP Prasanna Kumar) అన్నారు. బుధవారం రాత్రి పెన్ పహాడ్ మండలంలోని చీదేళ్ల లో మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ గోపి కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ' పోలీస్ ప్రజా భరోసా' కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ..జిల్లా ఎస్పీ నరసింహ సూచన మేరకు మండలంలో పల్లె పల్లెన పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహిస్తూ కార్యక్రమం ఉద్దేశ్యంపై ప్రజలకు అవగాహనా కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు. 

ప్రజల సహకారం లేకుండా పోలీస్ , న్యాయ వ్యవస్థ పటిష్టంగా పని చేయడం సాధ్యపడదని. ప్రజలంతా చట్టాన్ని గౌరవిస్తూ, అన్యాయాన్ని సహించకుండా ముందుకు వస్తే, పోలీస్ శాఖ పూర్తిగా మేమున్నామంటూ భరోసాగా ఉంటుందన్నారు.  సమాజం లో యువత మాదకద్రవ్యాలకు, ఆన్లైన్ బెట్టింగులకు బానిసలు కాకుండా,  చదువుపై, ఉద్యోగాలపై దృష్టి సారించాలన్నారు. గ్రామాలల్లో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహాకారం ప్రధానమన్నారు. కాగా పలు చట్టాలపై పోలీస్ కళాకారులు 'ఆట -పాట' ద్వారా అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో పెన్ పహాడ్ ఎస్ఐ గోపికృష్ణ,పోలీస్ సిబ్బంది  మురళిధర్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, ప్రవీణ్, బాలకృష్ణ, నరేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జూలకంటి వెంకటరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.