30 July, 2026 | 8:06 PM

Breaking News

భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •   బదిలీపై వెళ్తున్న డిఎంకు ఘన సన్మానం   •   పీర్జాదిగూడలో ఆగస్టు 9న బోనాల ఉత్సవాలు   •   బొల్లారంలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి   •   93/2 సర్వే నెంబర్లు పాసుపుస్తకాలు ఇవ్వాలి   •  

ఎన్‌టీఏను రద్దు చేయాలి

24-06-2024 02:36 AM
  • దోషులను కఠినంగా శిక్షించాలి: ప్రొఫెసర్ హరగోపాల్

బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ యూత్ నేతల యత్నం

లీకేజీలపై సుప్రీం జడ్జితో విచారించాలి: ఎస్‌ఎఫ్‌ఐ నేతలు

హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి): నీట్, యూజీసీ పరీక్షలలో అవకతవకలకు పాల్పడ్డ ఎన్‌టీఏ అధికారులను సస్పెండ్ చేయాలని, ఆ ఏజెన్సీని రద్దు చేయాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో హరగోపాల్ మాట్లాడుతూ నీట్‌ను రద్దు చేసి మళ్లీ పరీక్షను నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు.

నీట్, సీయూసెట్ లాంటి కేంద్రీకృత పరీక్షలను రద్దు చేసి, వాటి నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకు, యూనివర్సిటీలకు అప్పగించాలని చెప్పారు. కేంద్రీకృత పరీక్ష విధానాలకు కారణమైన జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విధానాన్ని తయారు చేయాలని సూచించారు. నీట్, నెట్ అవకతవకలపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జుడీషియల్ కమిటీ వేసి విచారణ జరపాలని కోరారు.

అలాగే ఆగస్టు 15లోపు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యార్థుల సంఖ్యను పెంచడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని చెప్పారు. విద్యావ్యవస్థలోకి ప్రభుత్వేతర సంస్థల చొరబాటును నిరోధించాలన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు వాచ్‌మెన్, విద్యా వలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు.

సుప్రీం జడ్జీతో విచారించాలి

నీట్ పరీక్ష ఫలితాలను తక్షణమే రద్దు చేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ అంశంపై డిమాండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఇంటి ముట్టడి నిర్వహించిన వివిధ విద్యార్థి, యువజన సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ ఖండించింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఎన్టీఏను రద్దు చేయాలని, లీకేజీ బాధ్యలను కఠినంగా శిక్షించాలని కోరింది. నీట్, నెట్ పరీక్ష లీకేజీలపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.

బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం

నీట్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్‌తో యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. గాంధీభవన్ నుంచి బయటికి రాకుండా పోలీసులు బారీకేడ్లను పెట్టారు. దీంతో పోలీసులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన్‌రెడ్డి మాట్లాడుతూ.. నీట్ పరీక్షా పేపర్ లీకేజీలో 14 మంది కేంద్రమంత్రుల ప్రమేయం ఉందని ఆరోపించారు.

నీట్ పరీక్షాపత్రం లీకేజీ చేసిన నిందితులను విచారిస్తే బీజేపీ నేతల బండారం బయటపడుతుందని, అసలు నిజాలు బయటికి వస్తే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. అందుకే నీట్‌ను రద్దు చేసేందుకు కేంద్రం వెనుకాడుతోందన్నారు. 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడుతోందని, మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను రద్దు చేయకపోతే పార్లమెంట్‌ను ముట్టడిస్తామన్నారు.