calender_icon.png 18 January, 2026 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగుజాతి ఖ్యాతిని చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్

18-01-2026 08:36:33 PM

తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కొంగర ప్రభాకర్

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ పట్టణంలోని పోలీస్ హెడ్కోటర్ సర్కిల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఆదివారం తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కొంగర ప్రభాకర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు, టిడిపి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షులు ఈగ మల్లేశం పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ... ప్రపంచ దేశాలకు తెలుగుజాతి ఖ్యాతిని చాటి చెప్పిన గొప్ప మహనీయుడు, కళామాతల్లి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ నియోజకవర్గం టిడిపి మాజీ ఇంచార్జి పుల్లూరు అశోక్ కుమార్, వరంగల్ టిడిపి పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి పిట్టల శ్రీనివాస్, పరకాల నియోజకవర్గ ఇన్చార్జి కందుకూరి నరేష్, అనిశెట్టి సతీష్, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.