calender_icon.png 30 May, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు

29-05-2025 12:31:27 AM

భద్రాచలం, మే 28 (విజయక్రాంతి) : స్వర్గీయ నందమూరి తారక రామారావు 102 వ జయంతి ఉత్సవాలు బుధవారం భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్ లో నందమూరి తారకరామారావు విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మహబూబాద్ పార్లమెంటు అడాక్ కమిటీ సభ్యులు కొడాలి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు కుంచాల రాజారాం తాళ్లూరు చిట్టిబాబు కొడాలి చంటి పోటు వెంకటేశ్వర్లు నూతలపాటి దాసయ్య కొండవీటి అశోక్ కొర్లపాటి రాము పల్లింటి దేశప్ప బోడెపుడి కృష్ణమూర్తి ఎల్లంకి రవి పోటు రాంబాబు పోర్ట్ నరేష్ రేపాక రాంబాబు కిరీటి గుణ్ణం రమేష్  తాళ్లూరు అనసూయ తాత సీత, కార్యకర్తలతు, అభిమానులు  ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు.

కల్లూరులో..

కల్లూరు, మే 28 : మాజీ ముఖ్య మంత్రి నందమూరి తారక రామారావు  జయంతి వేడుకలను బుధవారం  తెలుగుదేశం పార్టీ నాయకులు,తెలుగు యూవతనందమూరి అభిమానులు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలో యజ్ఞ నారాయణపురం గ్రామంలో గల  ఆయన  విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి  టపాసులతో  కోలాహలంగా జయంతి సంబరాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో తెలుగు యూవత స్వామినేని నవీన్ చౌదరి గ్రామ అధ్యక్షులు కార్యదర్శులు మరియు యజ్ఞ నారాయణపురం యువత సామినేని నవీన్ చౌదరి,సామినేని నరేష్, ఇంజం వంశీకృష్ణ, ఆళ్ళ కమలాకర్ రావు, గద్దె నరేష్, తూము రామయ్య, తూదెడ్డి రాము,తూదెడ్డి నాగేంద్రబాబు, సామినేని విక్కీ, రాయి గోపాలరావు, సామినేని వెంకటేశ్వరరావు, నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.