03-12-2025 12:35:01 AM
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్, డిసెంబర్ 2: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎప్పుడూ మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు చెప్తుం టారు. ఇదే కోవలో తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఐదూ పదేళ్లలో ప్రపంచం అణు యుద్ధాన్ని ఎదుర్కోబోతుందని జోస్యం చెప్పారు. యుద్ధ అనివార్యమని, ఎవరూ ఆపలేనిదని కూడా వ్యాఖ్యానించారు. అయితే.. అణు యుద్ధం ఎలా, ఎప్పుడు, ఎక్క డ మొదలవుతుందో, ఆ యుద్ధానికి కారణాలేమిటో మస్క్ స్పష్టంగా పేర్కొననప్పటికీ, ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కొందరు నెటిజ న్లు ఇప్పటికే ఆయన చేసిన వ్యాఖ్యలపై కృత్రిమ మేధస్సు (ఏఐ), ‘గ్రోక్’ మాధ్యమాల ద్వారా ఏయే దేశాల్లో యుద్ధాలు వచ్చే అవకాశం ఉందని ఆరా తీయడం మొదలుపెట్టారు. యూరప్‌లోని కొన్నిదేశాలు, తైవాన్ విషయంలో అమెరికా -చైనా మధ్య యుద్ధం జరగవచ్చనే ఆసక్తికర సమాధానాలను వారు గమనించారు. అణు యుద్ధం వస్తే.. అదే మూడో ప్రపంచ యుద్ధం కాబోతోందని కూడా ఏఐ, గ్రోక్ నుంచి సమాధానాలు రావడం ఆసక్తి రేపుతోంది.