calender_icon.png 3 December, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా సోదరుడు క్షేమంగా ఉన్నాడు!

03-12-2025 12:33:52 AM

ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యపరిస్థితిపై సోదరి స్పష్టత

ఇస్లామాబాద్, డిసెంబర్ 2: ‘నా సోదరుడు ఇమ్రాన్ ఖాన్ జైలులో క్షేమంగానే ఉన్నాడు. ఆయన ఆరోగ్యం కూడా బాగుంది. ఇమ్రాన్ ఖాన్‌కు ఏదో జరిగిందని కొందరు, హత్యకు గురయ్యాడని మరికొందరు చెప్తున్నారు. అవన్నీ కేవలం వదంతులే’నని పాక్‌స్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సోదరి ఉజ్మా ఖాన్ స్పష్టం చేశారు. మంగళవారం ఆమె రావల్పిండిలోని అడియాలా జైలుకు వెళ్లి తన సోదరుడిని పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు అధికారులు ఒంటరి కారాగారంలో ఉంచడం, ఆయనకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేయడంపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తన సోదరుడు శారీరక, మానసికంగా హింసకు గురవుతున్నాడని, అందుకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీరే బాధ్యుడని మండిపడ్డారు. ఇమ్రాన్‌ఖాన్‌కు సంబంధించిన క్షేమ సమాచారం బయటకు రావడంతో పుకార్లు, వదంతులకు ఫుల్‌స్టాప్ పడినట్లయింది.