18-05-2025 12:00:00 AM
- జాతీయ స్థాయిలో ‘అల్ట్రాసౌండ్ లైఫ్ సపోర్ట్’ శిక్షణ
హైదరాబాద్, మే 17 (విజయక్రాం తి): అత్యవసర పరిస్థితుల్లో వేగంగా వ్యాధిని గుర్తించేందుకు ఉపయోగపడే అల్ట్రాసౌండ్ నైపుణ్యాలను వైద్యులకు అందించేందుకు, బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో, సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా (సెమీ)తో కలసి శనివారం జాతీయ అల్ట్రా సౌండ్ లైఫ్ సపోర్ట్ (నల్స్) వర్క్‌షాప్‌ను నిర్వహించారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ వైద్యులు పాల్గొన్నారు. ట్రామా, కార్డియాక్ అరెస్ట్, షాక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్ల ను త్వరగా అంచనా వేసేందుకు అవసరమైన అల్ట్రాసౌండ్ సాంకేతికతలపై ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వబడింది. ఈ శిక్షణకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ 2 క్రెడిట్ హవర్స్ మంజూరు చేసింది.
ఇందులో ఈశై రష్, ఐవీసీ, లంగ్, కార్డియాక్ అల్ట్రాసౌండ్ లాంటి ముఖ్యమైన ప్రోటోకాల్స్‌పై ప్రత్యక్ష ప్రదర్శనలు, మోడ్యూల్ శిక్షణలు, ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె కిరణ్ కుమార్ వర్మ (కేర్ హాస్పిటల్స్ అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్, సెమీ అకడమిక్ చెయిర్ డాక్టర్ శ్రీనత్ కుమార్ టీఎస్, సెమీ బోర్డు అధ్యక్షురాలు డాక్టర్ సౌజ న్య పట్టిబండ్ల, కేర్ హాస్పిటల్స్, జోనల్ సీవోవో బిజు నాయర్ తదితరులు పాల్గొన్నారు.