calender_icon.png 18 May, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ డే

18-05-2025 12:00:00 AM

-ఉత్సాహంగా పాల్గొన్న మిస్ వరల్డ్ పోటీదారులు

-నేడు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, సెక్రటేరియట్ సందర్శన

హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి)/శేరిలింగంపల్లి/అబ్దుల్లాపూర్‌మెట్: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన సుందరీమణు లు శనివారం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో నిర్వ హించిన స్పోర్ట్స్ డేలో ఉత్సాహంగా పాల్గొన్నా రు. క్రీడా పోటీల్లో పాల్గొని అద్భుత ప్రతిభ కనబర్చారు.

109 దేశాల అందాల భామలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. అమెరికన్, కరీబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానియా విభాగాలుగా అందాలభామలను విభజించి మొ త్తం పది స్పోర్ట్స్ ఈవెంట్లు నిర్వహించారు. రోలర్ స్కేటింగ్, యోగా నమస్కారం, బాడ్మింటన్, షార్ట్‌ఫుట్, బాస్కెట్ బాల్, ఫుట్‌బాల్, షటిల్, ఫిట్‌నెస్ రన్ నిర్వహించారు. చివరలో అందరూ యోగాసనాలు వేసి అబ్బురపరిచారు.

అనంతరం అం దాల భామలందరూ జుంబా డాన్స్ చేశాక ఫొటో షూట్‌తో క్రీడలు ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు జ్ఞాపికలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వు, మిస్ వరల్డ్ ఫౌండర్ జూలియా మోర్లీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేం దర్‌రెడ్డి, ఎంపీ, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీబాల, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ మల్లారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ టూరిజం హనుమంత్ పాల్గొన్నారు. 

ప్రపంచ వేదికకు తెలంగాణ పరిచయం: మంత్రి జూపల్లి 

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికకు పరిచ యం చేయడానికి మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయడం, అద్భుతమైన పర్యాట క ప్రదేశాలను ప్రమోట్ చేయాలనే ఉద్దేశం కూడా ఈ పోటీల నిర్వహణలో ఉన్నదన్నారు.  

రామోజీ ఫిలింసిటీలో సందడి

ప్రపంచ సుందరీమణలు శనివారం సాయం త్రం రామోజీ ఫిలిం సిటీలో సందడి చేశారు. ప్రత్యేక బస్సుల్లో ఫిలింసిటీకి చేరుకున్న సుందరీమణులకు ఫిలింసిటీ ప్రతినిధులు, అధికారులు ముత్యాల దండలు వేసి స్వాగతం పలికారు. కుం కుమ బొట్లు పెట్టి సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు. ఫిలింసిటీ సైనేజ్ దగ్గర గ్రూప్ ఫొటోకు మిస్ వరల్డ్ పోటీదారులు ఫోజులు ఇచ్చారు. ఫిలింసిటీ అందాలను 108 దేశాలకు చెందిన పోటీదారులు తిలకించారు.

అక్కడ నిర్మాణ ప్రాం తాలను, పర్యాటక విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రోడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, పాల్గొన్నారు. ఆదివారం మిస్ వరల్డ్ పోటీదారులు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను, సెక్రటేరియట్‌ను సందర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరవు తారని అధికారులు తెలిపారు.