18-05-2025 12:00:00 AM
పేట్‌బషీరాబాద్, మే 17: రెనోవా హాస్పిట ల్స్ కొంపల్లిలో డాక్టర్ శ్రీధర్ పెద్దిరెడ్డి, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహించారు. రోగుల పట్ల అంకితభావంతో సేవలందిస్తున్న నర్సుల ను ఘనంగా సన్మానించారు.
వారి సేవలు ఎం తో విలువైనవని ప్రశంసించారు. నర్సులు స్వయంగా సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, ప్రదర్శించారు. ముందుగా ఫ్లోరె న్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హాస్పిటల్ నర్సులతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాధాకృష్ణ రావు సాగి, సీఈవో, రెనోవా మిడ్ లెవల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మాట్లాడుతూ.. నర్సులు ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముక వంటివారి కొనియాడారు. రవీంద్రనాథ్ గరగ, సీవోవో, రెనో వా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మాట్లాడుతూ.. ఈ ఏడాది నినాదం ‘మన నర్సులు, మన భవిష్య త్తు’ అని చెప్పారు.
నర్సులు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు గుండె వంటివారని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ జనర ల్, లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కె కృష్ణ మోహ న్, డైరెక్టర్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ ఎస్.శ్రీనాథ్, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అరుణ్ దేవ్, కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నితిన్‌రెడ్డి, సీనియర్ జనరల్ మేనేజర్ డాక్టర్ మహాదేవ్ పాల్గొన్నారు.