మిడ్జిల్‌లో కేఎల్‌ఐ కాల్వ నీరు.. రైతుల ఆనందం!
13-08-2026 12:30 PM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రైతుల కృతజ్ఞతలు
మిడ్జిల్: మిడ్జిల్ రైతుల సాగునీటి అవసరాల కోసం కేఎల్‌ఐ కాల్వలో నీరు విడుదల కావడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. కాల్వల్లో నీరు ప్రవహించడంతో సాగుకు భరోసా లభించిందని నాయకులు తెలిపారు. నీరు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రైతుల తరఫున నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్‌రెడ్డి, సర్పంచ్ ఎడ్ల శంకర్, మండల అధ్యక్షుడు ఎండి గౌస్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి తదితరులు కాల్వ వద్ద గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. కాల్వలో నీరు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.






