13 August, 2026 | 1:03 PM

ఎలాంటి లోటు రాకుండా చర్యలు తీసుకుంటాం

13-08-2026 11:59 AM

ఎదిర ప్రాంతాన్ని పరిశీలించిన డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎలాంటి లోటు రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. గురువారం 5వ డివిజన్‌లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు,  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

డివిజన్ పరిధిలోని డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా వీధి దీపాల నిర్వహణను డిప్యూటీ మేయర్ పర్యవేక్షించారు. నిర్మాణాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి సూచించారు. మురుగునీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్రం చేయాలని, చెత్త సేకరణ క్రమబద్ధంగా జరగాలని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు లలిత బాను చందర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది, స్థానిక నాయకులు, వార్డు ప్రతినిధులు కాలనీవాసులు పాల్గొన్నారు.