11 March, 2026 | 6:26 AM

నర్సింగ్ వృత్తి పవిత్రమైనది

09-03-2026 12:03 AM

సమాజ సేవకు అంకితం కావాలి 

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 8 (విజయక్రాంతి): సమాజంలో నర్సింగ్ వృత్తి ఎంతో పవత్రమైనదని, అకోర్స్ ను చదవటానికి ముందుకు వచ్చిన మీరు సమాజ సేవకు అంకితం కావాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆరోరా నర్సింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినిలు చేసిన  నృత్యాలు  అలరించాయి.

ముందుగా ఎమ్మెల్యే కూనంనేని  సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి  ఎస్.కె సాబీర్ పాష, కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్, డిప్యూటీ మేయర్ సుగుణలు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ హరిబాబు  అతిధులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... నర్సింగ్ కోర్సును  తీసుకున్న విద్యార్థినిలు  కష్టపడి చదివి  ఎదగాలన్నారు. సమాజంలో ఎన్నో వృత్తులు ఉన్నా కానీ  అత్యుత్తమైనది  నర్సింగ్ వృత్తి అన్నారు.

తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా  ఇతరుల ప్రాణాలను  కాపాడే వృత్తి లో ఉన్నందుకు మీరు గర్వపడాలన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో నర్సులు చేసిన సేవను వెలకట్టలేనిది అన్నారు. సమావేశ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా గారు, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేశ్ గారు, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి గారు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి గారు, కార్పొరేటర్ విశ్వం గారు, సిపిఐ నాయకులు పూర్ణ గారు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.