29 June, 2026 | 12:55 AM

రైతు ఆశీర్వాద సభను జయప్రదం చేయండి

29-06-2026 12:25 AM

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

ఖమ్మం, జూన్ ౨౮ (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా చింతకాని మండలం, జగన్నాదాపురం గ్రామంలో  ఈనెల 30న జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని   జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ కోరారు. ఆదివారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంజీవ్ రెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో  నూతి సత్యనారాయణ తో పాటు అర్బన్ జిల్లా అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి,

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావులు మాట్లాడుతూ  ప్రజా పాలన గావిస్తూ రైతు క్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ప్రజా ప్రభుత్వ రథ సారథి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతు సోదరులు,కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.

అదేవిధంగా జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు అహర్నిశలు శ్రమిస్తున్నారని రైతు మేళా, రైతు ఆశీర్వాద సభలో రైతులకొరకు 150 పైగా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారని వ్యవసాయ,ఉద్యానవనం,పశుసంవర్ధక,మత్స్య, పాల ఉత్పత్తి, సేంద్రియ వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ, ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ శాస్త్రవేత్తలను కూడా రైతులకు అందుబాటులోకి తెస్తున్నారని కావున రైతు సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని రైతు ఆశీర్వాద సభను జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, జిల్లా ఆర్ టి ఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న,రాష్ట్ర ఓ బీ సీ సెల్ ఉపాద్యక్షులు వడ్డేబోయిన నరసింహారావు, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భానోత్ బాలాజీ నాయక్, మాజీ సీనియర్ కార్పొరేటర్ కమర్తపు మురళి,జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘ అధ్యక్షులు దొబ్బల సౌజన్య,పుచ్చకాయల వీరభద్రం, మొక్క శేఖర్ గౌడ్, విప్లవ కుమార్, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు కిలారు అనిల్ కుమార్, ఫతే అహ్మద్,గుజ్జర్లపుడి రాంబాబు, బాణాల లక్ష్మణ్ గజ్జి సూర్యనారాయణ పాల్గొన్నారు.