2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు
10-04-2026 01:29 AM
మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల
హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ఆరోగ్యశాఖలోని 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలు గురువారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన నర్సుల సెలక్షన్ జాబితాను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రభుత్వ హాస్పిటళ్లలో 2024లో 6,956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం తాజగా ఇప్పుడు మరో 2,322 పోస్టులను భర్తీ చేసింది. దీంతో ప్రభుత్వ హాస్పిటళ్లలో నర్సుల కొరత పూర్తిగా తీరినట్టేనని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.




