calender_icon.png 11 January, 2026 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హే జనని పరిపాలిని..

09-01-2026 12:00:00 AM

తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్ర లో నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః. ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ విలేజ్ కామెడీ డ్రామాను ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్లపై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మిస్తున్నారు. ఈ చి త్రంలో ఈ షా రెబ్బా హీరోయిన్ కాగా బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, శివన్నారాయణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

జనవరి 23న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి తాజాగా థీమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ‘శారదవరధారి సరి.. శోభితకుచ శాతోదరి.. వైతాళిక వాసంతం.. వైవాహిక సారథ్యం.. సేవిత శుభకారీ విరి.. వాసిత వలజా మంజరి.. కోమలసుమ లాలిత్యం.. కాఠినసమ వైరుధ్యం.. శ్రీరమణీ రసవాహిని.. కాముక గుణ సహితం.. మహిమాన్విత మాతామహి.. శైశవదిశ లిఖితం..

హే జనని పరిపాలిని.. నీ అనురతి నిఖిలం.. ఆ తరుణీ ప్రాధేశనమాయుత ఘన వినుతం.. ఓంకారనాదానురాగాల మిళితం.. ఆబాలగోపాల జీవామృతం.. ఈ పంచభూతాల మూలం..’ అంటూ సాగుతోందీ పాట. ఈ సెకండ్ సింగిల్‌ను వుమెన్ ఆంథమ్‌గా స్వరపర్చారు జయ్‌కృష్ణ. భరద్వాజ్ గాలి గీత సాహిత్యం అందించగా, అభయ్ జోధ్‌పుర్కర్ ఆలపించారు. ఈ చిత్రానికి సంగీతం: జై క్రిష్; డీవోపీ: దీపక్ యెరగరా.