09-01-2026 12:00:00 AM
సామాజిక సంస్కర్తలు మహాత్మ ఫూలే, సావిత్రీబాయి ఫూలే జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ఫూలే’. ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ, పత్రలేఖ పాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనంత్ మహదేవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీలో గతేడాది విడుదలై ఘన విజయం సాధించింది. పొన్నం రవిచంద్ర ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముం దుకు తీసుకొస్తున్నారు. గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌నిర్మాత పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ.. “సమాజంలోని ఎన్నో దురాచారాలను రూపుమాపేందుకు పూలే దంపతులు పోరాటం చేసి, సమాజ హితం కోసమే తమ జీవితాలను అంకితం చేశారు.
ఇలాంటి గొప్పవారి జీవిత చరిత్ర మన వాళ్లకు సినిమా మాధ్యమం ద్వారా తెలియజెప్పాలనే ఫూలే సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నాం. గతంలో పైడి జయరాజ్ వంటి నేను అనేక డాక్యుమెంటరీస్ ద్వారా అంతర్జాతీయ అవార్డులు, ప్రశంసలు పొందాను. ఇది హిందీ అనువాదమై నా ఎక్కడా ఆ ఫీల్ కలగదు.
తెలుగు చిత్రంలాగే ఉంటుంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు ఈ సినిమాను విడుదలకు తీసుకొస్తాం. ప్రభుత్వం మా సినిమాకు సహకారం అందించాలని కోరుతున్నా” అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొని ఫూలే సినిమాకు పనిచేయడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.