09-01-2026 12:00:00 AM
అనగనగా ఒక రాజు
నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘అనగనగా ఒక రాజు’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూ న్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూ ర్యదేవర నాగవంశీ, సాయి సౌ జన్య నిర్మిస్తున్న ఈ సినిమాతో నూతన దర్శకుడు మారి వెండితెరకు పరిచయమవుతు న్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుం డగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది.
ఈ సందర్భంగా హైద రాబాద్‌లో ఏర్పాటుచేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కథానాయకుడు నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. “ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు. అందమైన భావోద్వేగాలు కూడా ఉంటాయి. నాకు రోడ్డు ప్రమాదం జరగడం వల్ల ఈ సినిమా రావడం ఆలస్యమైంది. ఆ లోటుని భర్తీ చేసేలా ఈ రెట్టింపు వినోదాన్ని అందిస్తుందీ సినిమా. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరు కుంటున్నా” అన్నారు.
కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. “ఈ సంక్రాంతికి కుటుంబంతో వచ్చి ఈ సినిమాను ఎంజాయ్ చేయండి. ఇందులో నేను చారులత పాత్ర పోషించా. ఇది నా మనసుకు దగ్గరైన పాత్ర. ఇది పక్కా పైసా వసూల్ ఫిల్మ్” అని చెప్పారు. దర్శకుడు మారి మాట్లాడుతూ.. “నవీన్, మీనాక్షి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది.
సంక్రాంతికి తగ్గ ఓ మంచి వినోదభరిత చిత్రమిది” అని తెలిపారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “ట్రైలర్‌లో ఎలాగైతే పంచ్‌లు పేలాయో.. సినిమా అంతా అలాగే పంచ్‌లు పేలుతాయి. రెండు గంటలపాటు మిమ్మల్ని నవ్విస్తూ నవీన్ శైలిలో సాగే సినిమా ఇది” అన్నారు.