ఓబీసీ కాలమ్‌పై పార్టీల వైఖరి వెల్లడించాలి

05-10-2026 | 05:15am
  1. 8న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం 
  2. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

అక్టోబర్ 4(విజయక్రాం తి): జాతీయ జనగణనలో ఓబీసీ కాలమ్ చే ర్చాలనే(OBC Column in Census) డిమాండ్‌పై అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు తమ వైఖరిని స్పష్టం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్(Jajula Srinivas Goud) డిమాండ్ చేశారు. బీసీల జనాభా లెక్కలు తేలితేనే జనాభా ప్రా తిపదికన వారికి రాజ్యాంగబద్ధమైన వాటా దక్కుతుందని అన్నారు.

దేశవ్యాప్తంగా ఓబీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా ఈ నెల 8న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో అఖిలపక్ష జాతీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాల యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 8న జరిగే అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

అనంతరం జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పార్లమెంట్‌లో ప్రాతిని ధ్యం ఉన్న 26 రాజకీయ పార్టీలకు ఆహ్వానా లు పంపినట్లు చెప్పారు. సమావేశంలో ఓబీ సీ కాలమ్ డిమాండ్‌పై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించా రు. ఓబీసీ కాలమ్‌పై పార్టీ అధ్యక్షులు స్వ యంగా ప్రకటన చేయాలని, కేవలం ద్వితీ య శ్రేణి నాయకులను పంపించి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు.

8వ తేదీలోగా స్పందించని రాజకీయ పార్టీల వైఖరిని ప్రజల ముందు వెల్లడిస్తామని హెచ్చరించారు. బీసీ సమస్యలపై రాజకీయ పార్టీలు స్పష్టమైన ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.  సమావేశంలో బీసీ కులాల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశాచారి, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు శ్యామ్ కుర్మ, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇంద్రం రజక పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు