calender_icon.png 4 December, 2024 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి చేనులో క్షుద్ర పూజలు

04-11-2024 12:22:44 AM

నాగర్‌కర్నూల్, నవంబర్ 3 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. తెలకపల్లి మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చిలికేశ్వరం పెద్ద తిరు పతయ్య పొలం వివాదాల్లో ఉండగా ఆ పొలంలోనే పత్తి పంటను సాగు చేశా రు. చాలా కాలంగా అన్నదమ్ముల మధ్య భూ వివాదం కొనసాగుతుండటంతో ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు.

గత రెండు రోజుల క్రితం అమావాస్య రోజు పత్తి చేనులో క్షుద్ర పూజలు జరిపి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానిస్తున్నా రు. ఆదివారం పత్తి తీయడానికి వెళ్లే క్రమంలో గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. దాయా దులే క్షుద్ర పూజలకు పాల్పడి ఉంటారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు.