10 March, 2026 | 8:41 PM

సావిత్రిబాయి పూలే వర్ధంతి

10-03-2026 06:50 PM

ముకరంపుర,(విజయక్రాంతి): బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే129వ  వర్ధంతి కార్యక్రమం జ్యోతిబాపూలే మైదానంలో నిర్వహించారు.  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వరాల జ్యోతి నరేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి పరుశురామ్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వాయిల రాజ్ కుమార్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి గాజే ప్రజ్జోద్, బిసి విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులు బియ్యని తిరుపతి,  బీసీ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు కాసరాజు, వరాల నరేందర్, తదితరులు పాల్గొన్నారు.