అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి ఫూలే
- మునుగోడు పట్టణంలో వర్ధంతి వేడుకలు
- సమాజంలో అసమానతలపై పోరాడిన సంఘ సంస్కర్త
- తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్
మునుగోడు,(విజయక్రాంతి): మహిళలతో పాటు సమాజంలోని అణగారిన వర్గాల విద్సాభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే అని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ అన్నారు. అన్ని వర్గాల ప్రజల హితం కోసం పోరాడిన పూలే సతీమణి సావిత్రి బాయి వర్ధంతి వేడుకలు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సావిత్రిబాయి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. భారతీయ సంఘ సంస్కర్త, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, రచయిత్రి, కులమతాలకు అతీతంగా అందరినీ హక్కున చేర్చుకున్న మహోన్నత వ్యక్తి సావిత్రి బాయి పూలే అని అన్నారు. సమాజంలో అసమానతల మీద అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి నర్సింహ గౌడ్, మాజీ సర్పంచ్ మాధగోని రాజేశ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు జిట్టగోని యాదగిరి ముదిరాజ్, పందుల భాస్కర్, తెలంగాణ ఉద్యమ JAC చైర్మన్ తోట నరసింహ చారి, పట్టణ అధ్యక్షులు అరెళ్ల సైదులు, బీఆర్ఎస్ యువజన నాయకుడు అయితగోని విజయ్,పందుల మల్లేష్, పందుల సంపత్ కుమార్,రాజేష్,బొజ్జ అంజి, లింగస్వామి, గోపి,గాదె రాజు,రాకేష్ నర్సింహా,శివరాజ్, బి.రాజు,హరిబాబు ఉన్నారు.




