లక్ష్మీనృసింహస్వామి ఆలయం మూసివేత
04-03-2026 12:00 AM
మంగపేట, మార్చి 3 ( విజయక్రాంతి ) : రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయాన్ని చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం మూసివేశారు. మంగళవారం ఉదయం ఆలయ అర్చకులు స్వామి వారికి వేద మంత్రాలతో అభిషేక, అర్చన, హారతి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం ఉదయం 8.30 గంటలకు ప్రధాన ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణంలోని ఉప ఆలయాలను మూసి వేశారు. బుధవారం ఉదయం సంప్రదాయబద్ధంగా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఉదయం 8.30 నుండి భక్తులకు దర్శనం కల్పించబడునని ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆర్. మహేష్ తెలిపారు.




