అధికారులు సమన్వయంతో పనిచేయాలి
రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్
రాజేంద్రనగర్, జూన్ 3: వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ప్రమాదాల నివారణకు అధికారులు సమన్వయంతో పని చేయాలని రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ అన్నారు. సోమవారం సర్కిల్ కార్యాలయంలో ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో నాలాలతో పాటు నీళ్లు నిలిచే ప్రదేశాలను తక్షణమే గుర్తించాలని సూచించారు. గుర్తించిన ప్రాంతాల్లో నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బ్లాక్ అయిన డ్రైనేజీ నాలాల్లో తక్షణమే వ్యర్థాలను తొలగించి శుభ్రం చేయాలని చెప్పారు. మున్సిపల్ సిబ్బంది ప్రజలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడా నీరు నిలవకుండా, చెత్తాచెదారం లేకుండా చూడాలని ఆదేశించారు. టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు పురాతన భవనాలు, కాంపౌండ్ వాల్స్‌ను గుర్తించి కూల్చివేయాలని పేర్కొన్నారు.
బీజేఎంసీలో..
వర్షా కాలం దృష్ట్యా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ శరత్‌చంద్ర తెలిపారు. ఈ మేరకు అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.






