6 May, 2026 | 4:00 AM

పద్మశాలీల సంక్షేమం కోసమే కార్యాలయాలు

24-06-2024 01:15 AM

పద్మశాలీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

సూర్యాపేట, జూన్23(విజయక్రాంతి): రాష్ట్రంలోని పద్మశాలీల సంక్షేమం కోసమే సంఘం ఆధ్వర్యంలో కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల, పద్మశాలీల మ్యారేజ్ బ్యూరో కార్యాలయాన్ని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరందాసు యాదగిరితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పద్మశాలీలు ఈ కార్యాలయాల ద్వారా అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులను ఆదుకోవడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల సంఘం అధ్యక్షులు నల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యేశాల విశ్వకుమార్, మిర్యాల రాజేందర్, పొట్టబత్తుల సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రాజేశం, శ్రీనివాస్, ప్రవీణ్, సాక్షి బ్యూర్ ఇన్‌చార్జి గణేష్, విజయ్‌కుమార్, శిరందాసు యాదగిరేందర్, గంజి వెంకట శ్రీనివాస్, జిట్ట శ్రీనివాస్, పాండు తదితరులు పాల్గొన్నారు.