డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వాకథాన్
24-06-2024 01:14 AM
ఫ్రీమేసన్స్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి) : ఫ్రీమేసన్స్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఆదివారం వాకథాన్‌ను నిర్వహించారు. ‘సే నో టు డ్రగ్స్’ అనే సందేశంతో అబిడ్స్ నుంచి ఎంజే మార్కెట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్ దేశాయ్, వీరభద్రుడు, మంచాల రమేష్, డాక్టర్ శ్రీరంగ్ అబ్కారీ, రాజ్ నర్సింగరావుతో పాటు సుమారు 100 మంది సభ్యులు పాల్గొన్నారు.






