1 August, 2026 | 1:52 AM

వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నా!

01-08-2026 12:56 AM

వీడియో ద్వారా ప్రధాని మోదీ సందేశం

న్యూఢిల్లీ, జూలై ౩౧: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన ‘చలో పార్లమెంట్’ నిరసనలో కొందరు తనతోపాటు తన దివంగత తల్లిని దూషించారని, అయినప్పటికీ మనస్ఫూర్తిగా క్షమిస్తున్నానంటూ ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రాం ద్వారా వీడియో సందేశమిచ్చారు. తమ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు తీసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తప్పులు చేయడం సహజమని, కానీ, ఆ తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవడం ముఖ్యమని చెప్పుకొచ్చారు.

దూషించిన వారిపై కోర్టు కేసులు పెట్టడం లేదా శిక్షించడం లేదా సామాజికంగా దూరంగా పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. తాను తీసుకున్న ఈ క్షమాపణ నిర్ణయాన్ని యావత్ దేశప్రజలంతా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. తప్పుదారి పట్టిన యువతను సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత పెద్దలపైనే ఉందని పేర్కొన్నారు. ఇకనైనా విద్యార్థులు గతాన్ని మరచిపోయి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.