6 June, 2026 | 3:18 AM

గుంతలమయంగా రోడ్లు.. పట్టించుకోని అధికారులు

06-06-2026 01:28 AM

కాలనీల వాసులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అంతే సంగతులు

గుంతల రోడ్లపై ప్రయాణానికి జంకుతున్న ప్రయాణికులు

మేడ్చల్ అర్బన్,  జూన్ 5 (విజయక్రాంతి): సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పట్టణంలోని కేఎల్‌ఆర్, ఉమానగర్, బాలాజీ నగర్, కిస్టాపూర్, వెంకట్రామయ్య నగర్, సూర్య నగర్ కాలనీలలో రోడ్లన్నీ గుంతల మయమయ్యాయి. పట్టణంలోని పలు కాలనీలలో ప్రజలు గుంతలు పడిన రోడ్లపై ప్రయాణించలేమని ఎన్నిసార్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలల తరబడి సీసీ, బిటి రోడ్లు సుమారు రెండు ఫీట్ల మేరకు గుంతలుపడి ద్విచక్ర వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుంది.

గుంతలుపడ్డ రోడ్ల గురించి ఎన్నిసార్లు చెప్పినా అంతే సంగతులు

మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని పలు కాలనీలలో సీసీ, బిటి రోడ్లుపై లోతైన గుంతలు పడ్డాయని వాటిని పూడ్చమని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.ప్రతి యేట మున్సిపల్ కు ఇంటిపన్నిలు వాణిజ్ఞ నీటి పన్నులు చెల్లించిన కూడా మున్సిపల్ అధికారులు కనీస మౌలిక సదుపాయాలను కల్పించకపోవడంపై పట్టణ ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతానికి మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని కేఎల్‌ఆర్ కాలనీలోని రోడ్లు పూర్తిగా ధ్వంసం కావడంతో అటువైపుగా వెళ్లే ప్రజలకు వాహనదారులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న అధికారులు కనికరించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజా పాలనలో ప్రజల సంక్షేమం చూడాల్సిన అధికారులు సమస్యలపై దృష్టి సారించాలని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గుంతలు పడిన రోడ్లపై మరమ్మత్తులు చేపట్టి పలు కాలనీల ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.