29 May, 2026 | 9:03 PM

క్షయవ్యాధిగ్రస్తులను అధికారులు దత్తత తీసుకోవాలి

29-05-2026 04:20 PM

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచన

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లాలో ఉన్న క్షయవ్యాధిగ్రస్తులను అధికారులు దత్తత తీసుకుని వారికి అవసరమైన మందులు, పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లాలో ప్రస్తుతం 464 మంది క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నారని పేర్కొంటూ, వారికి నెలవారీగా అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. చాలామంది దగ్గు, బరువు తగ్గడం వంటి లక్షణాలను బయటపెట్టకుండా మౌనంగా బాధపడుతున్నారని, సమాజంలో చిన్నచూపు భయంతో చికిత్సకు దూరమవుతున్నారని అన్నారు.అలాంటి వారిని గుర్తించి అవగాహన కల్పించి సరైన వైద్య సేవలు అందించాలని సూచించా