17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల మంజూరి పారదర్శకంగా జరగాలి

10-05-2025 11:42 PM

భద్రాచలం బిఆర్ఎస్ నియోజకవర్గ బాధ్యులు: మానే రామకృష్ణ

భద్రాచలం,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల మంజూరి విషయంలో అధికారులు పారదర్శకత పాటించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మానే రామకృష్ణ ఒక ప్రకటన తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే అతని అనుచరులు నియోజకవర్గంలో అన్ని మండలాలలో తమ స్వార్ధ ప్రయోజనాల కోసం లిస్టు తయారుచేసి ఆ లిస్టులే అధికారులు ఆమోదించాలని అధికారులపై ఒత్తిడి తీసికొస్తూ అధికారులని భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని అన్నారు. 

తారతమ్యం లేకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మానే రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇట్టి విషయంలో అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో పర్యవేక్షిస్తామని ఎటువంటి అవకతవకలకు పాల్పడ్డా ఎంతటి వారినైనా ఉపేక్షించే పనిలేదని అధికారులు ఈ విషయంలో తగు జాగ్రత్త వహించాలని లేనియెడల ఎస్సీ, ఎస్టీ కమిషన్, న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని మరల రీయంక్వైరీ చేయిస్తామని అట్టి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు ఉపేక్షించబోమని హెచ్చరించారు. 

మొన్న జరిగిన గృహ నిర్మాణ శాఖామంత్రి భద్రాచల నియోజకవర్గ పర్యటనలు ప్రతి మండలంలో ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవ్వడమే లబ్ధిదారుల ఎంపిక లిస్టులో ఎంత అవినీతి జరిగిందో దీనికి నిదర్శనం అని అన్నారు అట్టి విషయంలో మరలా సర్వే చేసి నిరుపేదలైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని భద్రాచలం నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జ్ మానే రామకృష్ణ  డిమాండ్ చేశారు.